BSNL Satellite Phone | నెట్‌వర్క్ లేకున్నా కాల్స్.. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి శాటిలైట్ ఫోన్‌ అందుబాటులోకి

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BSNL Satellite Phone | దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్‌ను సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) అత్యాధునిక శాటిలైట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫోన్ ధరను రూ.1,34,166గా నిర్ణయించింది. సాధారణ మొబైల్ టవర్లు లేదా సెల్యులర్ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఉపగ్రహాల ద్వారా కాల్స్, సందేశాలు పంపుకునే సౌకర్యాన్ని ఈ పరికరం కల్పిస్తుంది.

AP MBBS Seats | మరో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్

satilite

BSNL Satellite Phone | కమ్యూనికేషన్ పరిమితంగా ఉండే ప్రాంతాల్లో

ఈ శాటిలైట్ ఫోన్ ప్రధానంగా విపత్తు నిర్వహణ, అటవీ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు వంటి కమ్యూనికేషన్ సౌకర్యాలు పరిమితంగా ఉండే ప్రాంతాల్లో ఉపయోగపడేలా రూపొందించారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరంతర సమాచార మార్పిడికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.

అయితే ఈ శాటిలైట్ ఫోన్ సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా ప్రతి ఒక్కరి కోసం కాకుండా, ప్రభుత్వ శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు, సముద్ర, రక్షణ, ప్రత్యేక అవసరాలున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి తీసుకొచ్చిన సేవగా పేర్కొంది. శాటిలైట్ ఫోన్ వినియోగం ప్రభుత్వ నిబంధనలు, అనుమతులకు లోబడి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *