AP MBBS Seats | మరో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్

ఎన్‌ఎంసీ తాజా నిర్ణయం ప్రకారం కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనంగా 75 ఎంబీబీఎస్ సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 25 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: AP MBBS Seats | ఆంధ్రప్రదేశ్‌ Andhra Pradesh లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక అడుగు పడింది. రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలకు కలిపి మరో 100 ఎంబీబీఎస్ (MBBS) సీట్లను మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP MBBS Seats | కడప.. నెల్లూరు..

ఎన్‌ఎంసీ తాజా నిర్ణయం ప్రకారం కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనంగా 75 ఎంబీబీఎస్ సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 25 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య విద్యను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, అదనపు ఎంబీబీఎస్ సీట్ల మంజూరు ఆ దిశగా కీలక ముందడుగని పేర్కొన్నారు.

Kadapa Corona Deaths | ఏపీ లో మళ్ళీ కరోనా కలకలం.. ఇద్దరు మృతి..అప్రమత్తమైన ఆరోగ్యశాఖ

కొత్తగా మంజూరైన సీట్లతో రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే అవకాశాలు మరింత పెరుగుతాయని, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్యా మౌలిక వసతుల అభివృద్ధి, నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *