అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rain Alert | తెలంగాణ (Telangana)లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. భారీ వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఆదివారం సైతం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు (IMD) తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల్, వనపర్తిలో ఉదయం నుంచే వాన పడుతోంది. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి.
Heavy Rain Alert | ఆ జిల్లాలకు అలెర్ట్
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఆ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయి.
Heavy Rain Alert | జోరుగా సాగు పనులు
వర్షాలు పడుతుండటంతో రాష్ట్రంలో సాగు పనులు జోరందుకున్నాయి. పలు ప్రాంతాల్లో ముందస్తు వరినాట్లు ప్రారంభించారు. మొక్కజొన్న విత్తారు. వరి సాగు చేసే రైతులు తుకాలు పోస్తున్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోళ్లతో అన్నదాతలు బిజీగా ఉన్నారు. దీంతో ఎరువులు, విత్తనాల దుకాణాలు కళకళలాడుతున్నాయి.
దీనిని కూడా చదవండి : Telangana Earthquake | భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదు