Bungee Jump Death | సేఫ్టీ రోప్​ కట్టడం మర్చిపోయారు.. యువతి ప్రాణం తీసిన బంగి జంప్​

బంగి జంప్ ఓ యువతి ప్రాణం తీసింది. ఈ ఘటన బ్రెజిల్​లో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bungee Jump Death | బంగి జంప్ ఓ యువతి ప్రాణం తీసింది. నిర్వాహకుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన బ్రెజిల్ (Brazil)​లో చోటు చేసుకుంది.

బ్రెజిల్‌లో శనివారం బంగి జంప్ చేస్తుండగా, భద్రతా పరికరాలను సరిగ్గా కట్టుకోకుండా వంతెన పైనుంచి దూకడంతో 24 ఏళ్ల మహిళ మరణించింది. ఈ ఘోర ప్రమాదం సావో పాలో రాష్ట్రంలోని లైమీరా, కార్డెరోపోలిస్ నగరాలను కలిపే, పాడుబడిన పోంటే డో ఎస్క్వెలెటో వంతెన వద్ద జరిగింది. సుమారు మూడు దశాబ్దాలుగా ఉపయోగంలో లేని ఈ వంతెన వద్ద బంగి జంప్​ నిర్వహిస్తున్నారు. ఎంతో మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.

Bungee Jump Death | తాడు కట్టకుండానే..

ఓ మహిళ ఎంతో ఉత్సాహంగా బంగి జంప్​ దూకడానికి వచ్చింది. అయితే అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఆమెకు తాడు (రోప్​) కట్టకుండానే ఆమెను కిందకు తోసేశారు. దీంతో సుమారు 35 మీటర్ల లోతుకు పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి మృతి చెందింది. ఆ మహిళ ఆ జంప్ కోసం, ఆ అనుభవాన్ని వీడియో తీయడంతో సహా, సుమారు 290 డాలర్లు చెల్లించినట్లు సమాచారం. అంతా డబ్బు తీసుకున్న నిర్వాహకులు పర్యాటకుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించడంతో ఓ నిండు ప్రాణం పోయింది. నిర్వాహకులు జంప్ పూర్తయిన తర్వాతే తమ పొరపాటును గ్రహించారు.

Bungee Jump Death | పారిపోయే యత్నం

యువతి కింద పడిపోగానే సిబ్బంది అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. ఇన్‌స్ట్రక్టర్లను పోలీసులు హెలికాప్టర్లతో ఛేజ్ చేసి, మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ప్రదేశం సాహస క్రీడల కార్యకలాపాలకు సోషల్ మీడియాలో బాగా ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇది అధికారిక పర్యాటక కేంద్రం కాదు. భద్రతా మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారులు గతంలోనే ప్రవేశ పరిమితులు లేదా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Crop Diversification Delay | పంట మార్పిడిపై ప్రభుత్వం వీడియో.. ఆలస్యంగా చర్యలపై రైతుల ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *