అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Reservoir Inflows | హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు హిమాయత్సారగ్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట చెరువు)కు వరద ప్రారంభం అయింది. గత మూడు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో రెండు ప్రాజెక్ట్‌లకు వరద వస్తోంది.
ప్రస్తుతం హిమాయత్‌సాగర్ (Himayat Sagar)కు 800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, ఈ రెండు జలాశయాల నీటి మట్టాలను హైదరాబాద్ వాటర్ బోర్డ్ (HMWS SB) బృందాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని అధికారులు సూచించారు. గేట్ల ఎత్తివేత, నీటి విడుదలపై తీసుకునే నిర్ణయం వెంటనే ప్రజలకు తెలియజేస్తామన్నారు.
Hyderabad Reservoir Inflows | నీటి మట్టాలు

ఉస్మాన్ సాగర్ (Usman Sagar) పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1784.30 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1760.60 అడుగుల మేర నీరు ఉంది. జలాశయాల్లోకి వస్తున్న ప్రవాహాల పరిమాణం, నీటి మట్టాలను జలమండలి సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలకు అధికారులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, విపత్తు నిర్వహణ విభాగాలు, స్థానిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి సూచించింది. జలాశయాల దిగువన నది పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
దీనిని కూడా చదవండి : Warangal SI Case | భర్తతో విడాకులు ఇప్పించి.. ఒంటరి అబలను లోబర్చుకుని.. కీచక ఎస్సై లీలలు