అక్షరటుడే వెబ్‌డెస్క్: Vijay Deverakonda Scholarship | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన సొంతూరిపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. తన తండ్రి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని ‘తుమ్మన్‌పేట’కు రష్మిక మందన్నతో కలిసి వెళ్లిన విజయ్, అక్కడ కీలక ప్రకటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా తమ ‘దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా అచ్చంపేట మండలంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్‌లను ఆయన ప్రకటించారు.
Vijay Deverakonda Scholarship | చిన్ననాటి కల నిజమైంది..
గత ఫిబ్రవరిలో రష్మికతో కలిసి తాను ఒక “చిన్ననాటి కల” గురించి ప్రస్తావించిన విజయ్, ఇప్పుడు దానిని సాకారం చేశారు. కష్టపడి చదివి, తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టిన 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల జాబితాను విజయ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. విద్యార్థులను అభినందించడమే కాకుండా, వారికి ఆర్థిక భరోసా కల్పించడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Vijay Deverakonda Scholarship | ఎమోషనల్ బాండింగ్..
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు. “నా సొంతూరితో నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఈ ఊరికి నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. కేవలం సినిమాలతోనే కాకుండా, సమాజ సేవలోనూ తాము ఎప్పుడూ ముందుంటామని ‘విరోష్’ (విజయ్-రష్మిక) జంట మరోసారి నిరూపించారు. విజయ్, రష్మిక కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తన తండ్రి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేటకి రష్మికతో కలిసి బయలుదేరిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ
ఫిబ్రవరిలో రష్మిక మందన్నతో కలిసి ప్రకటించిన “చిన్ననాటి కల”ను నిజం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసిన విజయ్!
అచ్చంపేట మండలానికి చెందిన… pic.twitter.com/o4QH1alL64
— NTV Breaking News (@NTVJustIn) June 14, 2026
ఇది కూడా చదవండి: Hyderabad Reservoir Inflows | హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. జంట జలాశయాలకు వరద ప్రారంభం