అక్షరటుడే, వెబ్డెస్క్ : Water Tanker Strike | హైదరాబాద్ (Hyderabad) నగరంలో నీటి ట్యాంకర్ యజమానులు సమ్మె విరమించారు. బుధవారం వారు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో సమావేశం అయ్యారు. అనంతరం సమ్మెపై వెనక్కి తగ్గారు.
నగరంలో అక్రమ బోర్లపై హైడ్రా కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. చెరువుల పరిధిలో బోర్లు వేసి, అక్రమంగా ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది. దీంతో ప్రైవేట్ ట్యాంకర్ ఓనర్లు సమ్మె బాట పట్టారు. మంగళవారం నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో బుధవారం వారితో హైడ్రా కమిషనర్ చర్చలు జరిపారు. దీంతో నీటి సరఫరా పునరుద్ధరణకు అంగీకరించారు.
Water Tanker Strike | ఓఆర్ఆర్ బయట నుంచి..
వాటర్ ట్యాంకర్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైడ్రా కమిషనర్ చర్చించారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్డు బయట నుంచి నీటిని తోడి నగరంలో విక్రయించాలని హైడ్రా సూచించింది. ఈ మేరకు యజమానులు సైతం అంగీకరించారు.
Water Tanker Strike | అనుమతులు పొందిన తర్వాత..
నీటి ట్యాంకర్ల యజమానులు సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందిన తర్వాత ప్యూర్ (Peri Urban Region) ప్రాంతం నుంచే బోరు నీటిని సేకరించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు సంఘం సభ్యులు అంగీకరించారు. నగరంలో భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో నగరంలోని బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయొద్దని కమిషనర్ సూచించారు. వాణిజ్య బోర్ల ద్వారా భూగర్భ జలాలు మరింత పడిపోయి, ప్రజలు ఇబ్బందులు పడుతారన్నారు. దీంతో ఓఆర్ఆర్ బయటి నుంచి నీరు తెచ్చి సరఫరా చేసేందుకు ట్యాంకర్ల యజమానులు అంగీకరించారు.
Water Tanker Strike | నీటి ఎద్దడి
నగరంలో ఇప్పుడే నీటి ఎద్దడి మొదలైంది. ముఖ్యంగా అధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతాల్లో నీరు సరిపోవడం లేదు. నీటి కొరతతో హైటెక్ సిటీ, మాదాపూర్లోని కాలేజీలకు దీపావళి సెలవులను ముందుగానే ఇచ్చారు. నగరవాసులకు జలమండలి సరఫరా చేసే కుళాయి నీరు, ట్యాంకర్లు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో పలువురు అక్రమంగా బోర్లు వేసి నీటిని అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో హైడ్రా చర్యలు చేపట్టింది. నగరంలో భూగర్భ జలాలకు ఇబ్బందులు తలెత్తకుండా.. నీటి సరఫరా చేయాలని యాజమానులకు సూచించింది.
దీనిని కూడా చదవండి : Interstate Theft Gang | అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు