అక్షరటుడే, వెబ్‌డెస్క్: Disabled Welfare Telangana | దివ్యాంగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎల్బీ నగర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో దివ్యాంగుల పెన్షన్‌ను రూ.500 నుండి రూ.4,016కు పెంచామని గుర్తుచేశారు. అలాగే హౌసింగ్‌లో 5 శాతం, విద్య-ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలోనే దివ్యాంగుల చట్టాన్ని అత్యద్భుతంగా అమలు చేసి, భారత్‌లోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచేలా చేశామని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగుల పెన్షన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచలేదని ప్రశ్నించారు.
Disabled Welfare Telangana | ఏపీలో ఇస్తున్నారు..
చంద్రబాబు తన గురువు, ఏపీ తన ఆదర్శమని తరచూ చెప్పే రేవంత్ రెడ్డి.. అక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని హరీష్ రావు నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు, 80 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారికి రూ.15 వేల పెన్షన్ ఇస్తున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు గెలిచిన మొదటి నెల నుంచే పెన్షన్లు పెంచారని, మరి అదే బాబును ఆదర్శంగా తీసుకునే రేవంత్ రెడ్డి తెలంగాణలో దివ్యాంగులకు పెన్షన్‌ను ఎప్పుడు రూ.6 వేలకు పెంచి ఇస్తారని ప్రశ్నించారు. దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని స్పష్టం చేశారు. దివ్యాంగులు కోరిన విధంగా కేసీఆర్‌తో సంప్రదించి, బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకంగా ‘దివ్యాంగుల శాఖ’ను ఏర్పాటు చేసి వారిని పార్టీలో భాగస్వామ్యం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
Disabled Welfare Telangana | ప్రధాన డిమాండ్లు..
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దీనివల్ల ప్రభుత్వంపై పెద్దగా భారం పడదని హరీష్ రావు పేర్కొన్నారు. పెంచిన రూ.6 వేల పెన్షన్‌తో పాటు ప్రభుత్వం బాకీ పడిన రూ.66 వేల బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక లోకల్ బాడీ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
భారతదేశంలో దివ్యాంగుల చట్టాన్ని అమలు చేసి ఇండియాలో ది బెస్ట్ స్టేట్‌గా అవార్డ్ సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం
కేసీఆర్ గారి హయాంలో దివ్యాంగులకు రూ.500 ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచాడు
సంక్షేమ పథకాలలో హౌసింగ్‌లో 5% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ కల్పించారు… pic.twitter.com/dkEe5qY3dl
— Mirror TV (@MirrorTvTelugu) August 29, 2026
ఇది కూడా చదవండి: Lumino Industries IPO | భారీగా జీఎంపీ.. ఈపీసీ కంపెనీ ఐపీవోపై లుక్కేయండి