Women Welfare Schemes | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Women Welfare Schemes | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్​ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాన్ని పురస్కరించుకుని మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ అద్దె బస్సులను కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)తో కలిసి కలెక్టరేట్​లో ప్రారంభించారు.

Women Welfare Schemes | కాంగ్రెస్​ హయాంలో మహిళలకు పెద్దపీట..

సుదర్శన్ రెడ్డి (MLA P. Sudarshan Reddy) మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణాలు అందించడమే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దెబస్సులు, స్కూల్ యూనిఫాంల స్ట్రిచింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందిస్తోందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లను, రేషన్ కార్డులను కూడా మహిళల పేరిట మంజూరు చేస్తోందని తెలిపారు.

Women Welfare Schemes | అభివృద్ధికి పెద్దపీట

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే కేవలం నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు.రూ. 1,100 కోట్ల ఆర్థిక సాయం అందించిందన్నారు. కేవలం మహిళలు అనే కాకుండా అన్ని వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఎంతమాత్రం లేదన్నారు. ప్రజలు కూడా వాస్తవాలను గమనించాలని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని వసతులు, నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ బడులలో చేర్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని, తద్వారా అనవసర ఆర్థిక దుబారాను నివారించుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యాల పరిరక్షణకు దోహదపడే ఆహార ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు.

Women Welfare Schemes | 18 అద్దె బస్సులు

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మహిళల గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేలా ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే జిల్లాకు 18 అద్దె బస్సులను కేటాయించిందని తెలిపారు. అద్దె బస్సుల నిర్వహణను పక్కాగా పర్యవేక్షణ జరపాలని సమాఖ్య ప్రతినిధులకు సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సరికొత్త ఆలోచనలతో ప్రణాళికాబద్దంగా కృషి చేస్తే వ్యాపార పరంగా అద్భుత విజయాలు సాధించవచ్చని అన్నారు. నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్​కు ఆనుకుని అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనం త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్డీఏ సాయన్న, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Venture Controversy | ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఆరెకరాల వెంచర్​కు అనుమతి: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *