అక్షరటుడే, బోధన్ : Bodhan Toddy Death | బోధన్ మండలం (Bodhan Mandal) నర్సాపూర్ గేట్ వద్ద కల్లు దుకాణంలో ఓ వ్యక్తి కల్లు తాగి మృతి చెందగా.. మరొకరు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నియోజకవర్గంలో కలకలరం రేపింది.
Bodhan Toddy Death | బాధితుల నిరసన..
ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబీకులు శనివారం బోధన్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కల్తీ కల్లు తాగడం వల్లే మృతి చెందాడని.. మృతిచెందిన వ్యక్తి సంబంధీకులు కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Police | నేరాల నియంత్రణకు ప్రజలే మా బలం