Car Tanker Blast | గ్యాస్ నింపుతుండగా పేలిన కారు ట్యాంకు.. మూడు కార్లు, బైక్​ దగ్ధం..

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Car Tanker Blast | కార్లలో దొంగచాటుగా గ్యాస్​ నింపడం చట్టవ్యతిరేకమని తెలిసినా కొందరు డబ్బులకు ఆశపడి అక్రమాలకు పాల్పడుతున్నారు. డొమెస్టిక్​ గ్యాస్​ను యథేచ్ఛగా కార్లలో నింపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కార్​లో గ్యాస్​ నింపుతుండగా ట్యాంకు​ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మూడు కార్లు, బైక్​ దగ్ధమయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) పట్టణంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.

Car Tanker Blast | దేవునిపల్లిలో..

స్థానికుల కథనం ప్రకారం.. దేవునిపల్లి (Devunipally incident) గ్రామంలో ఓ కారులో సీఎన్జీ గ్యాస్ నింపుతున్నారు. ఈ క్రమంలో కారు ట్యాంకు పేలడంతో దట్టమైన పొగలు వ్యాపించి కారు దగ్ధమైంది. దాంతో పాటు గ్యాస్ నింపుతున్న కారు పక్కన పార్కింగ్ చేసి ఉన్న మరో రెండు కార్లు, ఓ బైక్ దగ్ధమయ్యాయి. కార్లు దగ్ధమయ్యే సమయంలో భారీగా శబ్దాలు రావడంతో స్థానికులు పరుగులు తీశారు. వెంటనే ఫైర్​స్టేషన్ (Kamareddy Fire station)​ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్​స్టేషన్​ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్​సిబ్బంది సమయానికి రాకపోయి ఉంటే చుట్టు పక్కల ఇళ్లకు మంటలు వ్యాపించి ఉండేవని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

car2

ఇది కూడా చదవండి: Biscuit Baba| కొత్తగా పుట్టుకొచ్చిన ‘బిస్కెట్ బాబా’.. భక్తి పేరుతో వికృత చేష్టలు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *