Advanced Neuro Treatments | యశోద ఆస్పత్రిలో అధునాతన న్యూరో చికిత్సలు

మెదడు, వెన్నెముక సమస్యలకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డా. కృష్ణ తేజ్ రెడ్డి తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Advanced Neuro Treatments | మెదడు, వెన్నెముక సమస్యలకు అత్యాధునిక చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని యశోద సెంటర్ ఫర్ న్యూరోఎండోస్కోపీ అండ్​ రోబోటిక్ న్యూరోసర్జరీ వైద్యులు డా. కృష్ణ తేజ్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి (Kamareddy) యశోద హాస్పిటల్స్ బ్రాంచిలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advanced Neuro Treatments | సికింద్రాబాద్​ యశోద ఆస్పత్రిలో..

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్​లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​లో న్యూరోఎండోస్కోపీ, రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీ, అధునాతన ఇమేజింగ్ ద్వారా ఇన్వాసివ్ విధానంలో చికిత్సలు అందిస్తున్నామని కృష్ణ తేజ్ రెడ్డి వివరించారు. మెదడు కణితులకు ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ సహాయంతో శస్త్రచికిత్స సమయంలోనే కణితి తొలగించే విషయాన్ని అంచనా వేసి కీలక మెదడు భాగాలకు హాని కలగకుండా సురక్షితంగా తొలగిస్తున్నామని తెలిపారు. మందులకు లొంగని మూర్ఛవ్యాధికి రోబోటిక్ సహాయంతో సహా పలు శస్త్రచికిత్స ఎంపికలు తమ వద్ద ఉన్నాయన్నారు.

Advanced Neuro Treatments | తీవ్రమైన ముఖనొప్పి..

తీవ్రమైన ముఖ నొప్పి అయిన ట్రైజెమినల్ న్యూరల్జియాకు ఎండోస్కోపిక్ మైక్రోవాస్కులర్ డికంప్రెషన్ ద్వారా దీర్ఘకాలిక ఉపశమనం కల్పిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు 110 కేసులను విజయవంతంగా చేశామని వెల్లడించారు. ప్రజల్లో అవగాహన కోసం అక్టోబర్ 7న ప్రపంచ ట్రైజెమినల్ న్యూరల్జియా దినోత్సవం రోజున ప్రత్యేక క్లినిక్​ను ప్రారంభించామని చెప్పారు. కామారెడ్డి, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఈ అధునాతన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కామారెడ్డి బ్రాంచ్ ఇన్​ఛార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Induru Dance Artists | శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇందూరు నృత్యకళాకారుల ప్రతిభ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *