అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad Chain Snatching | నిజామాబాద్ (Nizamabad) నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని , కమ్మలు అపహరించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ , ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను వెంటనే పరిశీలించాలని , నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని, నేరస్తుల కదలికలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించాలని కమిషనర్ సూచించారు.
Nizamabad Chain Snatching | అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. అదనపు డీసీపీ (అడ్మిన్ ) శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్ 3 ఎస్సై హరిబాబు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Hostels | హాస్టళ్లలో విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్