Kamareddy SI Transfers | కామారెడ్డి జిల్లాలో ఎస్సైల బదిలీలు.. కీలక స్టేషన్లలో అధికారుల మార్పు..

కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SI Transfers | జిల్లా పోలీసు శాఖలో (Kamareddy Police) బదిలీలు చోటుచేసుకున్నాయి. పలు కీలక పోలీసు స్టేషన్లలో ఇన్​ఛార్జీలుగా ఉన్న ఎస్సైలను సర్దుబాటు చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఉత్తర్వులు జారీ చేశారు.

Kamareddy SI Transfers | శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత పటిష్టంగా..

శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉండేలా ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. మాచారెడ్డి ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనిల్​ను భిక్కనూరు స్టేషన్​కు బదిలీ చేశారు. భిక్కనూరులో విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులును రాజాంపేటకు పంపగా, రాజాంపేటలో ఉన్న మహేష్​ను జిల్లా కేంద్రంలోని సీసీఎస్​కు కేటాయించారు. ఇక బీబీపేట స్టేషన్ బాధ్యతలు చూస్తున్న విజయ్ ను మాచారెడ్డికి, బాన్సువాడ టౌన్ ఎస్సై నవీన్ చంద్రను బీబీపేటకు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలతో పలు మండలాల్లో కొత్త ఎస్సైలు బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు తమ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది.

sp office

ఇది కూడా చదవండి: నాచారం చెరువు అభివృద్ధికి శ్రీ‌కారం.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *