Nandigutta Illegal Mining | నందిగుట్టను అక్రమ మైనింగ్ నుంచి కాపాడాలి..

ముదక్​పల్లి గ్రామంలోని నందిగుట్టను అక్రమ మైనింగ్​ నుంచి కాపాడాలని బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి బోడ మహేందర్​ డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nandigutta Illegal Mining | ముదక్​పల్లి గ్రామంలోని నందిగుట్టను అక్రమ మైనింగ్​ నుంచి కాపాడాలని బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి బోడ మహేందర్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు ప్రజావాణి (Prajavani)లో అధికారులకు ఫిర్యాదు చేశారు.

Nandigutta Illegal Mining | ఆలయాలున్న ప్రవిత్ర స్థలంలో..

ఈ సందర్భంగా బోడ మహేందర్​ మాట్లాడుతూ.. నందిగుట్ట ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోందన్నారు. ఈ గుట్టపై అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణం కోసం బేస్మెంట్, నాలుగు పిల్లర్లు వేసి నిర్మాణం కొనసాగిస్తున్నారన్నారు. అలాగే శివాలయం కూడా ఉందన్నారు. గుట్టకు ఆనుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, గణపతి ఆలయం కూడా ఉన్నాయన్నారు.

Nandigutta Illegal Mining | అసెన్డ్​మెంట్​ భూమిని లీజ్​కు తీసుకుని..

అయితే కొంతమంది నాయకులు నందిగుట్ట పక్కన ఉన్న అసైన్డ్​మెంట్​ భూమిని లీజుకు తీసుకొని మైనింగ్​కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆ సర్వే నంబర్​లో భూమిలో మైనింగ్ చేయడానికి మొరం లేదు. కానీ పక్కనే ఉన్న నందిగుట్ట మొరం తీద్దామని ప్రణాళిక వేస్తున్నారన్నారు. దీనికి మండల అధికారులు సహకరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. నందిగుట్టపై ఆలయాలు ఉన్న నేపథ్యంలో అక్కడ మైనింగ్ నిర్వహించడం వల్ల గుట్టకు, ఆలయాలకు మరియు పరిసర పర్యావరణానికి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా.. గ్రామప్రజల ఆధ్మాత్మిక మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాబట్టి నందిగుట్టను మైనింగ్ కార్యకలాపాల నుండి రక్షించి, మైనింగ్​కు అనమతులు ఇవ్వవద్దని అధికారులకు కోరుతున్నామన్నారు.

ఇది కూడా చదవండి..: Double Bedroom Issues | ‘పనులు చేస్తామని చెప్పిన కదా.. మళ్లీ ఈ డ్రామాలేంది..?’ మున్సిపల్​ కమిషనర్​ అసహనం.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *