Modi 25 Years Politics | మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకం..

ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Modi 25 Years Politics | ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకమని (Nizamabad) బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు. ప్రధాని ప్రజాజీవితంలో 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని (BJP Nizamabad) పాత గంజ్​లో ‘వికసిత్​ భారత్’​ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Modi 25 Years Politics | నవశకానికి నాంది..

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ(Modi Government) 25 ఏళ్ల పరిపాలనా ప్రస్థానం భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక నవశకానికి నాంది పలికిందని కొనియాడారు. జీవితంలో ఎన్నడూ బ్యాంకు గుమ్మం తొక్కని కోట్లాది మంది నిరుపేదలకు జన్​ధన్ ఖాతాలు తెరిపించి దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేశారన్నారు. కట్టెల పొయ్యి పొగతో అనారోగ్యం బారిన పడుతున్న కోట్లాది మంది పేద తల్లులు, అక్కాచెల్లెళ్లకు ‘ఉజ్వల’ గ్యాస్ కనెక్షన్లు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ‘పీఎం ఆవాస్ యోజన’ ద్వారా ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడంతో పాటు, ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా నేరుగా అన్నదాతల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నారు.

Modi 25 Years Politics | మోదీ ఆధ్వర్యంలోనే సర్జికల్​ స్ట్రైక్స్​..

గతంలో ఉగ్రవాదులు దాడులు చేస్తే శాంతి చర్చల పేరిట కాలయాపన చేసేవారని, కాని మోదీ నాయకత్వంలో సరిహద్దులు దాటి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన బలమైన సైనిక సత్తాను ప్రపంచానికి చాటామని దినేష్​ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, రాష్ట్రంలో ఎటువంటి అవినీతి లేని పారదర్శక డబుల్ ఇంజిన్ పాలన తీసుకురావడానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ‘

‘Modi 25 Years Politics | సేవా సంకల్ప్ అభియాన్’ – ‘ఆంగన్ మిలన్ సేవ’..

‘సేవా సంకల్ప్ అభియాన్’ – ‘ఆంగన్ మిలన్ సేవ’ కార్యక్రమంలో భాగంగా ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలోని అంగన్‌వాడీ టీచర్‌లకు దినేష్ పటేల్ కులాచారి, పల్లె గంగారెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి వనిత ఆధ్వర్యంలో సన్మానించి అభినందనలు తెలియజేశారు. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఏ నాయకుడికి సాధ్యం కాని రీతిలో అలుపెరుగని ప్రజాసేవ చేస్తున్న ఏకైక కర్మయోగి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దె భూమన్న, కంచెట్టి గంగాధర్, భారత్ రెడ్డి, నాగోళ్ల లక్ష్మీ నారాయణ, నిమ్మల శ్రీనివాస్, ప్రమోద్ కుమార్, జ్యోతి, న్యాలం రాజు, రాంచందర్, సురేంధర్, బొబ్బిలి వేణు, విజయ్ కృష్ణ, ఓం సింగ్, పిల్లి శ్రీకాంత్, వంశీ గౌడ్, మారెడ్డి వనిత  తదితరులు పాల్గొన్నారు.

67uk 898778

ఇది కూడా చదవండి: హస్తినకు బయలుదేరిన రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో కీలక భేటీలు! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *