Government Hospital Services | ప్రభుత్వ ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

నగరంలోని జీజీహెచ్​లో సేవలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Government Hospital Services | నగరంలోని(Nizamabad) జీజీహెచ్​లో (GGH Nizamabad) సేవలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని సుభాష్​ నగర్​లోని తన క్యాంప్​ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ నిధులను కేవలం 20 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని, వీటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉత్తమ చికిత్స అందేలా చూస్తామన్నారు.

Government Hospital Services | ఉత్తమ చికిత్స అందేలా చూస్తాం..

అలాగే హైదరాబాద్​లోని బీబీనగర్ లో ఉన్న ఏయిమ్స్​లో అత్యాధునిక వైద్య సేవలు ఉన్నాయని గుర్తు చేశారు.  కార్యక్రమంలో 27వ డివిజన్​ బీజేపీ సీనియర్​ నాయకుడు కల్పె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు రోడ్డెక్కాడు.. “నాకు న్యాయం చేయండి” అంటూ పట్నాలో ధర్నా చేపట్టాడు.

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *