Gutpa Alisagar Irrigation Water | ఫలించిన సుదర్శన్​ రెడ్డి, భూపతిరెడ్డి కృషి.. ఖరీఫ్​కు నీటివిడుదల

ఎట్టకేలకు సుదర్శన్​రెడ్డి, భూపతిరెడ్డి కృషి ఫలించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Gutpa Alisagar Irrigation Water |ఎట్టకేలకు సుదర్శన్​రెడ్డి (MLA Sudarshan Reddy ), భూపతిరెడ్డి (Bhupathi Reddy) కృషి ఫలించింది. జిల్లాలోని (Nizamabad) గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఆయకట్టు రైతులకు ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి విడుదలకు నీటి పారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Gutpa Alisagar Irrigation Water |జిల్లాలో ప్రధానంగా వరి..

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా వరి పంట సాగవుతుండగా, పంటలు కీలకమైన పొట్టదశలో ఉన్న నేపథ్యంలో సాగునీటి అవసరం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల పరిధిలోని ఆయకట్టుకు నిజాంసాగర్ నుంచే నీటిని విడుదల చేసి, రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని మంత్రిని కోరారు. అలీసాగర్, గుత్ప లిఫ్ట్‌లకు ప్రతి 10 రోజులకు ఒకసారి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం పంటలకు అత్యంత కీలకమైన దశ కావడంతో తక్షణమే నీటి విడుదల చేపట్టాలని వారు మంత్రిని కోరారు.

Gutpa Alisagar Irrigation Water |స్పందించిన మంత్రి..

వారి విజ్ఞప్తిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ఈ మేరకు అలీసాగర్ ఆయకట్టు పరిధిలోని సుమారు 48 వేల ఎకరాలకు, గుత్ప ఆయకట్టు పరిధిలోని సుమారు 35 వేల ఎకరాలకు కలిపి 83 వేల పైచిలుకు ఎకరాలకు ప్రయోజనం చేకూరేలా నీటిని విడుదల చేయనున్నారు. రోజుకు 1,500 క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో ఖరీఫ్‌లో సాగు చేస్తున్న వరి పంటకు అవసరమైన సమయంలో నీరు అందడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ.. మా పేరుతో వస్తున్న పోస్టులు అవాస్తవం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *