First Angiogram Nizamabad | ప్రభుత్వ జనరల్ హాస్పిటల్​లో తొలి యాంజియోగ్రామ్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: First Angiogram Nizamabad | నిజామాబాద్​ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్​లో తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్లు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డా. నాగ మోహన్ రావు తెలిపారు.

First Angiogram Nizamabad | ముఖ్యమైన మైలురాయిగా

సింకోపల్ అటాక్స్‌తో బాధపడుతున్న యాదయ్య అనే వ్యక్తికి యాంజియోగ్రామ్ విజయవంతంగా జరిపినట్లు పేర్కొన్నారు. కార్డియాలజీ, వైద్య బృందం సమష్టి కృషితో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఆధునిక గుండె వైద్య సేవల బలోపేతానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని డా. నాగ మోహన్ రావు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తోందన్నారు.

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో రోగులకు సత్వర సేవలు అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *