Government Hospital Services | ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను వినియోగించుకోవాలి..: ఎమ్మెల్యే ధన్​పాల్​

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Government Hospital Services | ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్(MLA Dhanpal) సూర్యనారాయణ సూచించారు. నగరంలోని సుభాష్ నగర్​లో గల ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను(CMRF cheques) పంపిణీ చేశారు.

Government Hospital Services | అప్పుల పాలు కావొద్దు

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితులు అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. ప్రభుత్వపరంగా అనేక ఆస్పత్రులు నాణ్యమైన చికిత్సలు అందజేస్తున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్​లో(Nizamabad GGH) వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన చికిత్స అందుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Government Hospital Services | బీబీనగర్​లో ఎయిమ్స్​లో..

కేంద్ర ప్రభుత్వం బీబీనగర్​లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్​లో(AIIMS) అత్యాధునిక చికిత్సలను అందజేస్తున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. అలాగే నిమ్స్​లోనూ చికిత్స కోసం ఎల్వోసీ అవసరమైతే తమ వద్దకు రావాలన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల బిల్లులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాధితులు దరఖాస్తు చేసుకున్న వాటిలో వారు 60 శాతం పైగా ఇవ్వాలని కోరారు. అనంతరం మొత్తం 97 మందికి రూ.21,43,000 విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, మఠం పవన్, ఎర్రం సుధీర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, బంటు ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Digital Health Cards| ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ నివేదికపై సర్కార్ క్లారిటీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *