Nizamabad Heart Tumor Surgery | ‘మెడికవర్​​’లో విజయవంతంగా గుండెలో కణితి తొలగింపు

తొలిసారిగా గుండెలో రక్త సరఫరాకు అడ్డుగా ఉన్న కణితిని శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించినట్టు మెడికవర్ హాస్పిటల్స్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Heart Tumor Surgery | తొలిసారిగా గుండెలో రక్త సరఫరాకు అడ్డుగా ఉన్న కణితిని శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించినట్టు మెడికవర్ హాస్పిటల్స్ (Medicover Hospitals) గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Nizamabad Heart Tumor Surgery | శ్వాస సంబంధిత సమస్యతో..

ఈ సందర్భంగా గుండె శస్త్రచికిత్స వైద్య నిపుణులు రాకేష్ కుమార్ మాట్లాడుతూ సుమారు 40 ఏళ్ల మహిళ ఆస్పత్రికి శ్వాస సంబంధిత సమస్య, కాళ్లవాపులతో వచ్చిందన్నారు. గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతో పరీక్షించినట్టు వైద్య నిపుణులు తెలిపారు. అయితే చేసిన పరీక్షల్లో గుండెలో ఏర్పడిన కణితి కారణంగా రక్తసరఫరాకు ఆటంకం ఏర్పడడం జరిగిందన్నారు. అయితే గుండెలో ఏర్పడిన ప్రతి కణితి క్యాన్సర్​కు సంబంధించింది కాదని తెలిపారు. ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా గుండెలో రక్త సరఫరాకు అడ్డుగా ఉన్న కణితిని తొలగించామన్నారు. దీంతో మహిళ ఆరోగ్యంగా వెళ్లడం జరిగిందన్నారు. నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలాంటి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా చేశామన్నారు.

అనంతరం మత్తు వైద్య నిపుణులు డాక్టర్ ఏలేటి వను, మెడికల్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్​ కూరపాటి యజ్ఞ మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన గుండె సర్జరీని గుండెలో కణితి కారణంగా రక్తసరఫరాకు ఆటంకం ఏర్పడటం అరుదైన, సవాలుతో కూడుకున్న పరిస్థితి అని వారు వివరించారు. నిజామాబాద్‌లో తొలిసారిగా ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.. అయితే డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ క్యాన్సర్ కణితికి గుండెల్లో ఏర్పడే కణితికి చాలా తేడా ఉంటుందన్నారు.. క్యాన్సర్ కు సంబంధించిన కణితి అయినప్పుడు వాటికి లక్షణాలు వేరేగా ఉంటాయని తెలిపారు. అలాగే క్షయ వ్యాధికి సంబంధించిన కణుతులు కూడా ఏర్పడతాయని చెప్పారు. నిపుణులైన వైద్యుల సూచన మేరకు సరైన చికిత్స తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్వామి, సెంటర్ హెడ్, డీఎంఎస్​ యజ్ఞ, వినయ్ కుమార్, మార్కెటింగ్ హెడ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Meru Caste Sewing Machines | మేరు కులస్తులకు కుట్టుమిషన్ల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *