Unseasonal Rain | కామారెడ్డిలో అకాల వర్షం.. ఆగమైన అన్నదాతలు..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Unseasonal Rain | కామారెడ్డిలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం కామారెడ్డి (kamareddy) పట్టణంలో అంతంత మాత్రమే కురిసిన వర్షం శివారు గ్రామాల్లో ముంచెత్తింది.

Unseasonal Rain | అడ్లూర్​ గ్రామంలో..

కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని అడ్లూర్ (adloor) గ్రామంలో భారీ వర్షం అన్నదాతలను ఆగం చేసింది. గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో గత నెలరోజులుగా ఎండకు ఎండిన వరిధాన్యం అకాల వర్షంతో తడిసిముద్దయింది. ఎండిన ధాన్యం బస్తాలలో నింపగా ఆ ధాన్యం సైతం తడిసిపోయింది. కుప్పలు చేసిన ధాన్యంపై టార్పాలిన్ కవర్లు (Tarpaulin Covers) కప్పినా కుప్పలు కిందకు వర్షపు నీరు చేసి ధాన్యం తడిసిపోయింది. దాంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తడిసిపోకుండా రైతులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గత నెల రోజులుగా ఎండిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గిపోయిందని, కాంటాలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.

vaana

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *