అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad POCSO Case | బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకుదుర్గాప్రసాద్ గురువారం తీర్పు వెలువరించారు.
బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. నిందితుడు ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ మేరకు బాధిత బాలిక తల్లి 2021 మార్చి 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం న్యాయస్థానంలో సంబంధిత ఆధారాలను సమర్పించి విచారణ ప్రక్రియను కొనసాగించారు. కేసులోని ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి దుర్గాప్రసాద్ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష విధించారు. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా వేశారు. బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : ACB Trap | 22-ఏ భూమి కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్