Shyam Metalics Durga Puja | శ్యామ్ మెటాలిక్స్ ఆధ్వర్యంలో ‘శక్తి ఏక్, రూప్ అనేక్’.. దుర్గాపూజలో ప్రత్యేక ఆకర్షణలు

ప్రముఖ పరిశ్రమల సంస్థ శ్యామ్ మెటాలిక్స్ దుర్గాపూజ మహోత్సవాల సందర్భంగా కోల్‌కతాలో ‘శక్తి ఏక్, రూప్ అనేక్’ పేరిట పలు వినూత్న, సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  Shyam Metalics Durga Puja | ప్రముఖ పరిశ్రమల సంస్థ శ్యామ్ మెటాలిక్స్ దుర్గాపూజ మహోత్సవాల సందర్భంగా కోల్‌కతాలో ( Kolkata )  ‘శక్తి ఏక్, రూప్ అనేక్’ పేరిట పలు వినూత్న, సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బెంగాల్ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెబుతూనే.. ప్రజల్లో ఆశను నింపడం, నగర భద్రత కోసం శ్రమిస్తున్న పోలీసు సిబ్బందిని గౌరవించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను రూపొందించింది.

Shyam Metalics Durga Puja | ముఖ్య ఆకర్షణలు..

SEL టైగర్ TMT బార్లతో ప్రత్యేకంగా దుర్గాదేవి రూపాన్ని ఇక్కడ తీర్చిదిద్దారు. పూజకు వచ్చే భక్తులు తమ ఆశలను, కోరికలను ఈ గోడపై రాసే అవకాశం కల్పించారు. సందర్శకులు రాసిన కోరికల్లో కొన్నింటిని ఎంపిక చేసి, తమ సంస్థ ద్వారా నెరవేరుస్తామని శ్యామ్ మెటాలిక్స్ ప్రకటించింది.

శక్తి టన్నెల్ ..
బెంగాల్ సంస్కృతి, కళలు, దుర్గాపూజ వైభవాన్ని ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన దృశ్యాలు , ఫోటోలు/సెల్ఫీలు దిగేలా ఒక ప్రత్యేకమైన టన్నెల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది భక్తులకు ఒక కొత్త అనుభూతిని అందించనుంది.

సంస్థ కార్పొరేట్ వ్యవహారాలు, సీఎస్ఆర్ డైరెక్టర్ సుమిత్ చక్రవర్తి మాట్లాడుతూ.. సమాజం పట్ల తమ బాధ్యత కేవలం వ్యాపారానికే పరిమితం కాదని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ‘వాల్ ఆఫ్ శక్తి’ ద్వారా ప్రజల కలలను సాకారం చేస్తూనే, ‘శక్తి బూత్‌’ల ద్వారా నిరంతరం శ్రమించే పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. అలాగే సంస్థ సీఓఓ నిర్మల్ ఉదయ్ స్పందిస్తూ.. దుర్గాపూజ అనేది శక్తిలోని విభిన్న రూపాలను కొలిచే పండుగని, ఆ శక్తి భావనను కేవలం విగ్రహాలకే పరిమితం చేయకుండా భక్తులు ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా ఈ వినూత్న కార్యక్రమాలను రూపొందించామని వివరించారు.

Shyam Metalics Durga Puja | పోలీసుల కోసం ‘శక్తి బూత్’లు ..

పండుగ సమయంలో నగరంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ నిరంతరం శ్రమించే బెంగాల్ పోలీసులకు కృతజ్ఞతగా ఈ ‘శక్తి బూత్’ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలో పనిచేసే పోలీసు సిబ్బందికి ఇవి ఎంతో ఉపశమనం కలిగిస్తాయి.

Shyam Metalics Durga Puja | ఏర్పాట్లు & విస్తరణ..

కోల్‌కతాలోని ప్రధాన పూజా వేదికలైన ముదియాలి క్లబ్, న్యూ టౌన్ సార్వజనిన్, తాలా బరోవారీ దుర్గోత్సవ సమితుల వద్ద ఈ మూడింటినీ ప్రధానంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవే కాకుండా బెంగాల్ వ్యాప్తంగా ఉన్న మరో 30 దుర్గాపూజా మండపాల వద్ద పోలీసుల కోసం ‘శక్తి బూత్‌’లను అందుబాటులోకి తేవనున్నారు.

ఇది కూడా చదవండి:  ACB Trap | 22-ఏ భూమి కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *