అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | మేడ్చల్ జిల్లా కీసర (Keesara) తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ (ACB) అధికారులు గురువారం దాడులు చేవారు. రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా రెవెన్యూ అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కీసర డిప్యూటీ తహశీల్దార్ అమనగంటి సందీప్ కుమార్ రెడ్డి సెక్షన్ 22-A కింద నిషేధిత జాబితా నుండి ఫిర్యాది తల్లి, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న వ్యవసాయ ఆస్తులను తొలగించడం కోసం లంచం అడిగాడు. కావలి బాలకృష్ణ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే నిషేధిత జాబితా నుంచి భూమి తొలగిస్తానని చెప్పాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.
ACB Trap | రూ.2.5 లక్షలు తీసుకుంటుండగా..
డిప్యూటీ తహశీల్దార్ సందీప్ కుమార్రెడ్డి మొదటి విడతగా గురువారం రూ.2.50 లక్షల లంచం తీసుకున్నారు. ఆయన నేరుగా డబ్బులు తీసుకోకుండా గ్రామ రెవెన్యూ అధికారి(జీపీవో) నన్నూరి విజయకుమార్ రెడ్డి, ప్రైవేట్ వ్యక్తి బాలకృష్ణ ద్వారా లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు నిషేధిత జాబితాలో పడ్డాయి. వాటిలో అర్హత ఉన్నవాటిని ఆ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని కొందరు రెవెన్యూ అధికారులు వరంగా మార్చుకున్నారు. దరఖాస్తులను పరిష్కరించడానికి రూ.లక్షల లంచం డిమాండ్ చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Electricity AE Bribery | మీటర్ల ఏర్పాటుకు రూ.1.20 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఏఈ