Borewell Rescue Tragedy | బోరుబావిలో పడిన మనవడు.. కాపాడబోయి తాత మృతి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Borewell Rescue Tragedy | బోరుబావిలో పడిన మనవడిని కాపాడటానికి వెళ్లిన తాత మృతి చెందాడు. ఈ విషాధ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District) మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంది.

మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి (Ootlapalli Village) చెందిన వెంకన్న (53) ఉప సర్పంచ్​గా కొనసాగుతున్నారు. ఆయన శనివారం ఉదయం తన నాలుగేళ్ల మనవడితో కలిసి వ్యవసాయ పొలం వద్ద మామిడి చెట్లకు నీరు పట్టడానికి వెళ్లాడు. అయితే అక్కడ రన్నింగ్​లో ఉన్న బోరు కుంగిపోయింది. వెంకన్న మనవడు ఆడుకుంటూ వెళ్లి ఆ బోరు బావిలో పడిపోయాడు. గమనించిన వెంకన్న కాపాడాటానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన కూడా బావిలో పడిపోయారు.

Borewell Rescue Tragedy

Borewell Rescue Tragedy | రెస్క్యూ ఆపరేషన్​

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఓ వ్యక్తికి తాడు కట్టి లోనికి పంపించారు. ఆ వ్యక్తి మొదట వెంకన్నను బయటకు తీశాడు. అనంతరం బాలుడిని రక్షించాడు. అయితే వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో వెంకన్న చనిపోయాడు. బాలుడు మాత్రం సురక్షితంగా బయట పడ్డాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: FCI Godown Fire | FCI గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *