Bhogapuram Airport Protest | రోడ్డు పనులు అడ్డుకున్న రైతులు.. జేసీబీ బకెట్​తో పక్కకు తొలగించిన అధికారులు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhogapuram Airport Protest | ఏపీలోని విజయనగరం జిల్లా (Vizianagaram District) భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్డుకు భూసేకరణ ఉద్రిక్తతకు దారి తీసింది.

తమకు పరిహారం ఇవ్వకుండా భూములు సేకరించడానికి వీలు లేదని కొందరు రైతులు నిరసన తెలిపారు. వారిని అధికారులు జేసీబీ బకెట్​తో పక్కకు తొలగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైతులు అందులోనూ వృద్ధులు అని జాలి లేకుండా జేసీబీతో పక్కకు తొలగించడంపై ప్రజలు మండిపడుతున్నారు. వారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.

Bhogapuram Airport Protest | పరిహారం కోసం..

బైరెడ్డిపాలెం గ్రామం (Baireddypalem Village)లో భోగాపూరం ఎయిర్​పోర్టు అప్రోచ్​ రోడ్డు పనులను అధికారులు చేపట్టారు. అయితే విమానాశ్రయం అభివృద్ధి కోసం తమ భూములను తీసుకుని, ఇప్పటికీ పరిహారం చెల్లించలేదంటూ ఇద్దరు రైతులు అడ్డుకున్నారు. జేసీబీ బకెట్​లో కూర్చొని నిరసన తెలిపారు. అయితే అధికారులు, పోలీసులు అందరు ఉండగానే వారిని జేసీబీ బకెట్​తో పైకి లేపి పక్కకు తొలగించారు. వారి బయపెట్టడానికి అలా చేశారు. అయినా పోలీసులు అడ్డుకోకపోవడం గమనార్హం. పరిహారం కోసం పనులను అడ్డుకుంటే చంపేస్తారా అంటూ కాంట్రాక్టర్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bhogapuram Airport Protest | ఆర్డీవో హామీ ఇవ్వడంతో..

గ్రామంలో భూ సేకరణ ప్రక్రియను గతంలోనే అధికారులు పూర్తి చేశారు. రైతులకు పరిహారం కూడా ఇచ్చారు. అయితే రైతులు బైరెడ్డి అప్పలనర్సయ్య, తోటమ్మలు ఆ పరిహారం తీసుకోవడానికి అంగీకరించలేదు. దీంతో అధికారులు భూములను ఎయిర్‌పోర్టు (Airport) సంస్థకు అప్పగించి, పరిహారాన్ని కోర్టుకు అటాచ్‌ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఎయిర్​పోర్టు సిబ్బంది పనులు చేపట్టడానికి రావడంతో రైతులు అడ్డుకున్నారు. అయితే జేసీబీ బకెట్ సాయంతో పక్కకు పెట్టడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీవో సుధాకర్‌ను కలిసి తమ సమస్య చెప్పుకున్నారు. కోర్టులో ఉన్న అవార్డు నగదు త్వరగా వచ్చేలా చూస్తానని, ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.

ఇది కూడా చదవండి..: Nanded Dharmavaram Express | నాందేడ్​–ధర్మవరం వీక్లీ ఎక్స్​ప్రెస్​ క్రమబద్ధీకరణ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *