Mother Son SSC Success | ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాస్ అయిన తల్లి, కొడుకు

Naresh Chandan
Mother Son SSC Success | ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాస్ అయిన తల్లి, కొడుకు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mother Son SSC Success | పట్టుదల ఉంటే వయస్సు అడ్డుకాదనే సందేశాన్ని ఆచరణలో చూపించిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మీలహరి, తన కొడుకు విజయ్‌తో కలిసి పదో తరగతి పరీక్షలు రాసి విజయాన్ని సాధించడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

Mother Son SSC Success | ఓపెన్ స్కూల్ ద్వారా..

వ్యక్తిగత కారణాల వల్ల ఆరో తరగతిలోనే చదువు ఆపాల్సి వచ్చిన లక్ష్మీలహరి, చదువుపై ఉన్న అభిరుచిని మాత్రం వదులుకోలేదు. కాలం గడిచినా విద్యను కొనసాగించాలనే సంకల్పంతో ఓపెన్ స్కూల్ ద్వారా తిరిగి చదువును ప్రారంభించారు. తన కొడుకు విజయ్‌తో కలిసి పరీక్షలకు సిద్ధమై, ఒకే సారి పదో తరగతి పరీక్షలు రాయడం విశేషంగా నిలిచింది.

ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో కుమారుడు విజయ్ 600 మార్కుల్లో 562 మార్కులు సాధించగా, లక్ష్మీలహరి 500 మార్కుల్లో 360 మార్కులు సాధించి ఉత్తీర్ణత పొందారు. ఫలితాలు చూసిన క్షణంలో తల్లి–కొడుకులు ఆనందంతో పాటు భావోద్వేగానికి లోనయ్యారు.

Mother Son SSC Success | సమాజానికే స్ఫూర్తి

ఈ ఘటన విద్యపై ఉన్న నిబద్ధత, కృషి, పట్టుదలకు అద్దం పడుతోంది. జీవితంలో ఎప్పుడైనా తిరిగి ప్రారంభించవచ్చని, లక్ష్యం ఉంటే సాధ్యం కాదనేది ఏదీ లేదని ఈ తల్లి–కొడుకులు నిరూపించారు. వారి విజయం చుట్టుపక్కల వారికి మాత్రమే కాకుండా సమాజానికే స్ఫూర్తిగా నిలుస్తోంది.

Gandhi Organ Transplant | గాంధీ హాస్పిటల్‌లో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్.. రేపే ప్రారంభం

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *