Indiramma Houses Telangana | డబుల్ బెడ్‌రూం ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

Naresh Chandan
Indiramma Houses Telangana

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indiramma Houses Telangana | తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి Ponguleti Srinivasa Reddy కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, లబ్ధిదారులకు త్వరగా గృహాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Indiramma Houses Telangana | మే చివరి నాటికి పూర్తి చేయాలని

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న Indiramma Housing Scheme కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాన్ని మే చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి అదనంగా రూ. 5 లక్షల వరకు సహాయం అందించనున్నట్లు తెలిపారు.

కాంట్రాక్టర్లు అందుబాటులో లేకపోతే, లబ్ధిదారులే స్వయంగా ఇళ్ల నిర్మాణం కొనసాగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇందుకు అవసరమైన నిధులను గ్రీన్ ఛానల్ విధానంలో త్వరగా విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Indiramma Houses Telangana | రూ. 400 కోట్ల కేటాయింపు

కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 400 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే ప్రతి ఇంటి నిర్మాణానికి 40 టన్నుల ఉచిత ఇసుక అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఇసుక వినియోగంలో అక్రమాలు, దుర్వినియోగం చోటుచేసుకుంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిర్మాణ పనుల్లో పారదర్శకత, వేగం ఉండేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

TIMS Sanathnagar Trial | టిమ్స్​లో ట్రయల్ రన్.. రేపటి నుంచి ఓపీ సేవలు!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *