అక్షరటుడే, వెబ్‌డెస్క్: Formula E Case | ఫార్ములా-ఈ రేసు వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టుకు వచ్చారు. ఉదయం కోకాపేటలోని తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా న్యాయస్థానానికి చేరుకున్నారు. కోర్టు పనులు ముగిసిన వెంటనే, ఉదయం 11:30 గంటలకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన నర్సంపేటకు బయలుదేరనున్నారు.
Formula E Case | కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
కోర్టుకు వచ్చిన సమయంలో కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తనపై కావాలనే కుట్రపూరితంగా ఈ అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులు ప్రజా సమస్యలపై తాము చేసే పోరాటాలను ఏమాత్రం నిలువరించలేవని, చివరికి నిజమే గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Formula E Case | అసలు ఈ కేసు ఏమిటంటే..?
నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్‌కు చెందిన ‘ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్ (FEO)’ సంస్థకు రూ. 55 కోట్లు మళ్లించారనే ఆరోపణలతో 2024 డిసెంబర్లో ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. సుమారు 15 నెలల పాటు దర్యాప్తు జరిపిన అనంతరం, ఈ సంవత్సరం మార్చిలో కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ రేసుకు స్పాన్సర్‌గా ఉండాల్సిన ‘ఏస్ నెక్స్ట్ జెన్’ సంస్థ తప్పుకోవడంతో, నిబంధనలను పక్కన పెట్టి ఆ భారాన్ని ప్రభుత్వమే మోసేలా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారని దర్యాప్తు బృందం ఆరోపిస్తోంది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు అప్పటి అధికారులైన అరవింద్ కుమార్, బి.ఎల్.ఎన్. రెడ్డిలతో పాటు ఆల్బెర్టో లాంగో, కిరణ్ రావులను నిందితులుగా చేర్చారు. కోర్టు ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిందితులు కోర్టుకు హాజరుకావడం ఇదే మొదటిసారి.
ఫార్ములా-ఈ కేసు: నాంపల్లి కోర్టుకు చేరుకున్న కేటీఆర్
ఫార్ములా-ఈ రేసింగ్ కేసు విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు.
ఈ వ్యవహారంపై కోర్టులో నేడు విచారణ జరగనుంది.#Udayam #BreakingNews #KTR #FormulaECase #NampallyCourt… pic.twitter.com/ShsVQzO1OK
— ఉదయం (@udayamdigital) July 31, 2026
ఇది కూడా చదవండి..: Godavari Flood Alert | గోదావరిలోకి భారీ వరద.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ