నిజామాబాద్Ex Mla Jajala | బండి సంజయ్​ను బర్తరఫ్​ చేయాలి: మాజీ ఎమ్మెల్యే జాజాల

Ex Mla Jajala | బండి సంజయ్​ను బర్తరఫ్​ చేయాలి: మాజీ ఎమ్మెల్యే జాజాల

బండి సంజయ్​ను బర్తరఫ్​ చేయాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ డిమాండ్​ చేశారు.

అక్షరటుడే, గాంధారి: Ex Mla Jajala | కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్​ను (bandi sanjay) బర్తరఫ్​ చేయాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు గాంధారి (gandhari) మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Ex Mla Jajala | సామాన్యులకు ఒక రూల్​.. బండి సంజయ్​కి ఒక రూలా..?

పోక్సో కేసులో (POCSO Case) సామాన్యులకు ఒక రూల్​.. బండి సంజయ్​కి ఒక రూల్​ ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని.. పోలీసులను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. న్యాయం కావాలంటూ ఓ బాధితురాలు ప్రభుత్వాన్ని కోరడం దానికి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా చిత్రంగా ఉందన్నారు. బీజేపీ(BJP party) పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందని ప్రగల్బాలు చెప్పుకోవడం కాదని.. వాటిని ఆచరణలో పెట్టి చూపించాలన్నారు.

పోక్సో కేసు నమోదైన అనంతరం నిందితుడిని అరెస్ట్​ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సింది పోయి పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఏమిటని జాజాల ప్రశ్నించారు. ఈ కేసుకు బండి సంజయ్​ను బాధ్యుడిని చేస్తూ ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు.

ఇది కూడా చదవండి: Work From Home | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!.. మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ఎన్ఐటీఈఎస్

 

Share post:

Popular

More like this
Related

Sand Transport Rules | ఇసుక రవాణాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Sand Transport Rules | ఇసుక రవాణా...

Work From Home | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!.. మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ఎన్ఐటీఈఎస్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Work From Home | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న...

TRS Flag Festival | మే 20 నుంచి టీఆర్​ఎస్​ జెండా పండుగలు : కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRS Flag Festival | తెలంగాణ (Telangana)...

Youth Congress Leaders | యువజన కాంగ్రెస్ నుంచి గొప్ప నాయకులు ఎదిగారు : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Youth Congress Leaders | దేశంలో ఎంతోమంది యువజన...