Sand Transport Rules | ఇసుక రవాణాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Sand Transport Rules | ఇసుక రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) హెచ్చరించారు. సోమవారం ఐడీవోసీ(IDOC) వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, మైనింగ్, ఇంజినీరింగ్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.

Sand Transport Rules | ఇసుక రీచ్​లను తనిఖీ చేయాలి

కలెక్టర్ మాట్లాడుతూ, ఇసుక రీచ్​లను(Sand Reach) క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. మన ఇసుక వాహనం ఆన్​లైన్​ బుకింగ్ ద్వారా ఇసుక కేటాయింపులు జరగాలని, ఇసుక రవాణా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తూ.చా తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇసుక వాహనాల రాకపోకలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తూ అక్రమాలకు తావులేకుండా చూడాలన్నారు. ఇసుక రీచ్​ల వద్ద టీజీఎండీసీ అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Young India Integrated Residential School), జవహర్ నవోదయ విద్యాలయం (Jawahar Navodaya Vidyalaya) భవన సముదాయాల నిర్మాణాలకు అవసరమైన ఇసుక నిల్వలను నిర్దేశిత ఇసుక రీచ్​ల నుంచి తరలించేందుకు కలెక్టర్ అనుమతించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, మైనింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Work From Home | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!.. మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ఎన్ఐటీఈఎస్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *