నిజామాబాద్Paddy Procurement | చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్...

Paddy Procurement | చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

కొన్నిచోట్ల పంట ఆలస్యంగా చేతికి రావడంతో ధాన్యం కొనుగోళ్లలో స్వల్ప జాప్యం జరుగుతోందని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు.

అక్షరటుడే, ​భీమ్​గల్ : Paddy Procurement | కొన్నిచోట్ల పంట ఆలస్యంగా చేతికి రావడంతో ధాన్యం కొనుగోళ్లలో స్వల్ప జాప్యం జరుగుతోందని, రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. ఆయన భీమ్​గల్​, వేల్పూర్, చెంగల్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Paddy Procurement | లక్ష టన్నుల ధాన్యం సేకరించాం..

​అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని, మిగిలిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గోదాముల కొరత ఉన్నందున దగ్గరలోని నిల్వ కేంద్రాలకు ట్రాక్టర్ల ద్వారా, దూర ప్రాంతాలకు లారీల ద్వారా ధాన్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు చేసే ప్రచారాన్ని నమ్మి రైతులు (Farmers) తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు.

​Paddy Procurement | ప్రకృతి వనరులపై వెసులుబాటు..

చెరువుల్లో మట్టి, మొరం తీసుకోవడానికి రైతులకు పూర్తి వెసులుబాటు కల్పించామని, ఇందుకోసం అధికారులకు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎక్కడైనా టిప్పర్లను ఆపితే సహించేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో లాభసాటి వ్యవసాయం కోసం 8 రకాల సన్న బియ్యం రకాలను ప్రోత్సహిస్తామని, పామాయిల్ సాగుచేసే రైతులకు సబ్సిడీలు అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, సబ్ కలెక్టర్, డీసీసీ అధ్యక్షుడు నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Elderly Man Missing | పోలీసుల కృషితో పాతికేళ్లకు సొంతింటికి చేరిన వృద్ధుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

US Senator Comments|చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు…. ‘వీసా కార్టెల్’ అంటూ ఆరోపణలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:US Senator Comments|అమెరికాలోని మిస్సోరి రాష్ట్ర రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్...

Dharpally Police | ఆగ్రహంతో వేలు కొరికిన వ్యక్తి.. రిమాండ్​కు తరలించిన పోలీసులు

అక్షరటుడే, డిచ్​పల్లి: Dharpally Police | చిన్నపాటి వాగ్వాదంలో ఓ వ్యక్తి...

Elderly Man Missing | పోలీసుల కృషితో పాతికేళ్లకు సొంతింటికి చేరిన వృద్ధుడు

అక్షరటుడే, కామారెడ్డి: Elderly Man Missing | దాదాపు పాతికేళ్ల క్రితం...

Telangana Sewerage Projects | పట్టణాల్లో ‘మెగా’ సీవరేజ్ ప్రాజెక్టులు.. రూ. 3,705 కోట్లు కేటాయించిన సర్కార్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana Sewerage Projects|తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం , మురుగునీటి...