క్రైంDharpally Police | ఆగ్రహంతో వేలు కొరికిన వ్యక్తి.. రిమాండ్​కు తరలించిన పోలీసులు

Dharpally Police | ఆగ్రహంతో వేలు కొరికిన వ్యక్తి.. రిమాండ్​కు తరలించిన పోలీసులు

చిన్నపాటి వాగ్వాదంలో ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తి వేలు కొరికేశాడు. ఈ ఘటన ధర్పల్లి మండలం హొన్నాజీపేట్​లో శుక్రవారం చోటు చేసుకుంది.

అక్షరటుడే, డిచ్​పల్లి: Dharpally Police | చిన్నపాటి వాగ్వాదంలో ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తి వేలు కొరికేశాడు. ఈ ఘటన ధర్పల్లి (Dharpally) మండలం హొన్నాజీపేట్​లో శుక్రవారం చోటు చేసుకుంది.

Dharpally Police | ధర్పల్లి మండలంలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హొన్నాజీపేట్ (honnajipet)​ గ్రామానికి చెందిన మచ్చ శోభతో గ్రామానికి చెందిన పెద్ది రాకేష్ అనే వ్యక్తి అకారణంగా వాదనకు దిగాడు. సమాచారం తెలుసుకున్న శోభ భర్త పెద్ది బాలయ్య ఎందుకు తన భార్యతో గొడవకు దిగావని రాకేష్​ను అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా ఆగ్రహంతో ఉన్న రాకేష్.. బాలయ్య ఎడమ చేయి మధ్య వేలును కొరికేశాడు. దీంతో వేలులో కొద్ది భాగం తెగి కింద పడిపోయింది. అనంతరం రాకేష్​ సంఘటనా స్థలం నుంచి పారిపోగా బాలయ్యను ఆయన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు రాకేష్​ను అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Telangana Sewerage Projects|పట్టణాల్లో ‘మెగా’ సీవరేజ్ ప్రాజెక్టులు.. రూ. 3,705 కోట్లు కేటాయించిన సర్కార్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

High Speed Train | హైస్పీడ్​ రైలు కారిడార్​పై సీఎస్​ సమీక్ష

అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Speed Train | హైదరాబాద్ (Hyderabad)...

US Senator Comments|చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు…. ‘వీసా కార్టెల్’ అంటూ ఆరోపణలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:US Senator Comments|అమెరికాలోని మిస్సోరి రాష్ట్ర రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్...

Paddy Procurement | చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

అక్షరటుడే, ​భీమ్​గల్ : Paddy Procurement | కొన్నిచోట్ల పంట ఆలస్యంగా...

Elderly Man Missing | పోలీసుల కృషితో పాతికేళ్లకు సొంతింటికి చేరిన వృద్ధుడు

అక్షరటుడే, కామారెడ్డి: Elderly Man Missing | దాదాపు పాతికేళ్ల క్రితం...