Crematorium Development Issues | శ్మశాన వాటికల అభివృద్ధిలో నాయకులు వెనకబడ్డారు: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Crematorium Development Issues | కామారెడ్డి నియోజకవర్గం (Kamareddy Constituency) నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, విప్​లుగా పనిచేసినా పట్టణంలో ఉన్న శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడంలో వెనకబడ్డారని టీపీసీసీ (TPCC) జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Crematorium Development Issues | రెండు హిందూ శ్మశాన వాటికలు..

పట్టణంలో రెండు హిందు శ్మశాన వాటికల్లో (Graveyards) వసతులు లేవని, దహన సంస్కారాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గడ్డం చంద్రశేఖర్​ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో (kamareddy news) టుఫిడ్​కో నిధుల ద్వారా హౌసింగ్​ బోర్డు శ్మశాన వాటికకు రూ.3 కోట్లు, ఇందిరానగర్ శ్మశాన వాటికకు రూ.60లక్షలు మంజూరయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మున్సిపల్ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ హయాంలో టుఫిడ్​కో నిధుల ద్వారా హౌజింగ్ బోర్డు శ్మశాన వాటికకు రూ.80 లక్షలు, ఇందిరానగర్ శ్మశాన వాటికకు రూ.50 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో టెండర్లు వేయక పనులు చేయలేకపోయారని తెలిపారు. అయితే ప్రస్తుతం వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి తన స్వచ్ఛంద సంస్థ ద్వారా శ్మశాన వాటికల అభివృద్ధికి ముందుకు రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. అయితే వాటి అభివృద్ధి కోసం ఎన్​వోసీ కోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జిల్లా అడిషనల్ కలెక్టర్​ను కోరారని తెలిపారు.

Crematorium Development Issues | రెండుమూడు రోజుల్లో అన్ని కుల సంఘాలతో..

రెండు మూడు రోజుల్లో పట్టణంలోని అన్ని కులసంఘాలు, సదర్ సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పనుల ప్రారంభానికి కావాల్సిన అనుమతులు కలెక్టర్, సీఎం (CM Revanth Reddy) ద్వారా ఇప్పించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా శ్మశాన వాటికల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) కౌన్సిలర్లతో చెప్పడం సంతోషకరమన్నారు. ఏడాది క్రితం స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి శ్మశాన వాటికను సందర్శించారని, ఇప్పటికీ ఆ పనులు చేపట్టలేదన్నారు. పట్టణంలోని శ్మశాన వాటికలతో పాటు కామారెడ్డి పట్టణ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా స్వచ్చంద సంస్థలు, దాతలు ముందుకు వస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీ జిల్లా కార్యదర్శి జూలూరు సుధాకర్, కౌన్సిలర్ గడ్డమీది మహేష్, క్రేడా అధ్యక్షుడు నర్సాగౌడ్, మాజీ కౌన్సిలర్లు వంశీ, సలీమ్, జమీల్, నాయకులు రంగ రమేష్ గౌడ్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Medical Seat Scams | మెడికల్ సీట్ల పేరిట మోసాలు.. తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్​ హెచ్చరిక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *