హైదరాబాద్Medical Seat Scams | మెడికల్ సీట్ల పేరిట మోసాలు.. తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్​ హెచ్చరిక

Medical Seat Scams | మెడికల్ సీట్ల పేరిట మోసాలు.. తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్​ హెచ్చరిక

పిల్లల ఎంబీబీఎస్​ సీట్ల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్​ తల్లిదండ్రులకు సూచించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Medical Seat Scams | ప్రస్తుతం ఇంటర్​ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మెడికల్​ సీట్ల భర్తీ కోసం దేశవ్యాప్తంగా నీట్​ పరీక్ష ఈ నెల 3న జరగనుంది. అయితే మెడికల్ కాలేజీల్లో (Medical Colleges) తమ పిల్లలను చదవించాలని చాలా మంది తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ నీట్​లో కొందరికే సీట్లు వస్తాయి.

తమ పిల్లలను డాక్టర్లు చేయాలని కలలు కనే తల్లిదండ్రులను కొందరు మోసం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ (Hyderabad CP Sajjanar) సూచించారు. వైద్య వృత్తికి సమాజంలో ఉన్న అపారమైన గౌరవం, ఆ వృత్తిపై ఉన్న క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకోవాలని చూస్తున్న కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Medical Seat Scams | మోసపోవద్దు

నీట్​లో తక్కువ మార్కులు వచ్చినా మేనేజ్‌మెంట్ కోటాలో తక్కువ ధరకే ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని కొందరు మోసం చేస్తారని సీపీ తెలిపారు. అలాగే ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, చైనా, అర్మేనియా, కరేబియన్ వంటి దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయవచ్చని చెప్పే దళారుల మాటలు విని మోసపోవద్దన్నారు. గతంలో ఎంతో మంది ఇలా మోసపోయి.. తమ డబ్బులు, పిల్లల విద్యా సంవత్సరం కోల్పోయారన్నారు.

Medical Seat Scams | వారికి డబ్బులు ఇవ్వొద్దు

విదేశీ యూనివర్సిటీ (Foreign University)కి వెళ్లాలనుకునే వారు ఆ కాలేజీకి భారత ప్రభుత్వ నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు ఉందో లేదో చెక్​ చేసుకోవాలని సజ్జనార్​ సూచించారు. అడ్మిషన్ల కోసం దళారులకు డబ్బు ఇవ్వొద్దని ఆయన పేర్కొన్నారు. నేరుగా కాలేజీలోనే డబ్బులు కట్టాలన్నారు. ఎంబీబీఎస్ సీట్ల పేరుతో ఎవరైనా సంప్రదించినా, డబ్బుల కోసం వేధిస్తున్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Kadiyam Srihari Comments | కేసీఆర్ వైఖరి నచ్చకే బయటకు వచ్చా.. కడియం సంచలన వ్యాఖ్యలు!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Dumping Yard | డంపింగ్ యార్డ్ వద్ద వ్యక్తి ఆత్మహత్య

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Dumping Yard | డంపింగ్ యార్డ్ వద్ద ఓ...

Son Attack Father | తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు..

అక్షరటుడే, బాన్సువాడ: Son Attack Father | తండ్రీకొడుకుల మధ్య ఏర్పడిన...

Disabled Vehicle Distribution | అర్హులైన వికలాంగులందరికీ వాహనాలు అందజేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

అక్షరటుడే, ఇందూరు: Disabled Vehicle Distribution | అర్హులైన వికలాంగులందరికీ ప్రభుత్వం...

Jabalpur Boat Tragedy | ప్రాణం పోతున్నా బిడ్డను వీడలేదు.. జబల్‌పూర్‌లో కంటతడి పెట్టించే విషాదం

అక్షరటుడే, మధ్యప్రదేశ్: Jabalpur Boat Tragedy | మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని...