అక్షరటుడే, వరంగల్: Kadiyam Srihari Comments | మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పాలన, ఆయన కుటుంబంపై స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్టేషన్ ఘనాపూర్ మండలం మీదికొండలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేసీఆర్ వైఖరి వల్లే తాను ఆ పార్టీకి దూరమయ్యానని స్పష్టం చేశారు.
Kadiyam Srihari Comments | వరంగల్‌ను ఆరు భాగాలుగా విడగొట్టి:
వరంగల్ జిల్లా (Warangal District)కు ఉన్న గొప్ప రాజకీయ చరిత్రను కేసీఆర్ కనుమరుగు చేశారని కడియం ఆరోపించారు. జిల్లాను ముక్కలు చేయవద్దని తాను గతంలోనే సూచించినప్పటికీ, తన మాటను లెక్కచేయకుండా వరంగల్‌ను ఆరు భాగాలుగా విడగొట్టి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు.
Kadiyam Srihari Comments | కుటుంబ ప్రయోజనాల కోసమే తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని కడియం వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర సంపదను దోచుకోవడమే లక్ష్యంగా ఆ కుటుంబం పనిచేసిందని ఆరోపించారు. తెలంగాణ (Telangana)ను కేసీఆర్ ఆగం చేశారని స్వయంగా ఆయన కుమార్తె కవితే చెబుతున్నారని, దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత కుమార్తె ఎందుకు దూరమైందో చెప్పలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు.
Kadiyam Srihari Comments | రాజకీయ ఫిరాయింపులపై ప్రశ్నలు:
గతంలో కేసీఆర్ ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని, రాజీనామా చేయకపోయినా మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని కడియం గుర్తు చేశారు. “మీరు చేస్తే రాజకీయం.. ఇతరులు చేస్తే తప్పా?” అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ అహంకారం, అవినీతి నచ్చకే తాను బీఆర్ఎస్ (BRS)ను వీడానని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: conductor attacks officer | లంచం అడిగిన అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్

