Telangana Cabinet Meeting | 21న రాష్ట్ర కేబినెట్ సమావేశం..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల (Assembly Meetings) నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు, అకడమిక్ క్యాలెండర్, పంటల మార్పిడి విధానం, ఫీజుల నియంత్రణతో పాటు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు వంటి పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్​లో అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల పనితీరు వంటి అంశాలు చర్చకు రానున్నట్లు తెలిసింది.

Telangana Cabinet Meeting | జర్నలిస్ట్​ ఇళ్ల స్థలాలపై..

ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న జర్నలిస్ట్​ ఇళ్ల స్థలాల వ్యవహారంలో మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్​ 2న గుడ్​న్యూస్​ చెబుతామని సీఎం తెలిపారు. దీనిపై కేబినెట్​లో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అర్హులైన విలేకరులకు మేలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇళ్ల స్థలాల కోసం 18 ఏళ్లుగా జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీతో పాటు ఇతర సొసైటీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. కోర్టు కేసులు, ఇతర అంశాలతో ఇళ్ల స్థలాల వ్యవహారం ముందుకు సాగలేదు. తాజాగా దానిపై మంత్రివర్గంలో చర్చించనుండటంతో జర్నలిస్ట్​లు హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Street Dog Attack | హైదరాబాద్​లో దారుణం.. బాలుడిపై 10 వీధికుక్కల దాడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *