Farmers Protest | సొసైటీకి తాళం వేసి రైతుల నిరసన

Srinivas Kolluri

అక్షరటుడే, కోటగిరి: Farmers Protest | పోతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డేలి గ్రామంలో రైతులు మంగళవారం సొసైటీకి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు పుప్పాల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. తమకు అవసరం లేని నానో యూరియా లిక్విడ్​ (Nano Urea Liquid) అంటగట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో తీసుకున్న లిక్విడ్ మిగిలిపోయి ఉందన్నారు. మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ఒక లిక్విడ్​ బాటిల్​ తీసుకోవాలనే కండీషన్​ పెట్టడంతో రైతులు (Farmers) నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లిక్విడ్ తీసుకోవడం మూలంగా రైతులపై రూ.200 అదనపు భారం పడుతుందన్నారు. ఇప్పటికే మందుల రేట్లు పెరిగిపోయాయని పేర్కొన్నారు. 10 సంచులకు ఒకటి ఇస్తే తీసుకుంటామని తెలిపారు.

Farmers Protest | స్పందించిన ఏవో

రైతుల ఆరోపణలపై ఏవో నిశితను వివరణ కోరగా.. రైతులకు అనవసరంగా నానో యూరియా ఇవ్వొద్దని చెప్పామన్నారు. సొసైటీ వాళ్లను అడిగితే రైతులు లిక్విడ్ తీసుకోకుంటే స్టాక్ రిటర్న్ చేస్తామని చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో రైతులు రుక్మయ్య, అర్జున్, సురేందర్, అశోక్, ప్రవీణ్, భారత్, చందు, గణేష్, రాము, ఆంజనేయులు, వినయ్, సురేందర్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Cabinet Meeting | 21న రాష్ట్ర కేబినెట్ సమావేశం..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *