Cattle Shed Fire | ప్రమాదవశాత్తు పశువుల కొట్టానికి నిప్పు.. అగ్నికీలల్లో జీవాలు విలవిల

Shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Cattle Shed Fire | ప్రమాదవశాత్తు కొట్టానికి నిప్పు అంటుకోగా.. అగ్నికీలల్లో పశువులు విలవిలలాడాయి. ఈ ఘటనలో ఓ లేగదూడ మృతి చెందింది. కామారెడ్డి జిల్లా గాంధారి (Gandhari) మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Cattle Shed Fire | చద్మల్​ తండాలో..

మండలంలోని చద్మల్​తండాకు (Chadmal Thanda) చెందిన మాండు దేవిసింగ్ అనే రైతు తన నాలుగు ఆవులు, రెండు గేదెలు, రెండు ఎడ్లు ఒక దూడను, మరోరైతు ఇందల్ సింగ్​కు చెందిన రెండు ఆవులను కలిపి తమ పొలం వద్ద ఉన్న గుడిసెలో కట్టేశారు. వాటికి మేత వేసి, నీళ్లు పెట్టి ఇంటికి వచ్చారు.

అయితే, ప్రమాదవశాత్తు కొట్టానికి నిప్పంటుకుంది. దీంతో కొట్టంలోని పశువులకు కూడా అగ్నికీలలు అంటుకున్నాయి. ఈ క్రమంలో ఓ లేగదూడ ఘటన స్థలంలోనే అసువులు బాసింది. మరికొన్ని పశువులకు కాలిన గాయాలయ్యాయి. ఫైరింజన్​కు (Fire engine) సమాచారం ఇచ్చినప్పటికీ అది వచ్చేలోపే కొట్టం పూర్తిగా కాలిపోయింది. దాదాపు 11 మూగజీవాలకు నిప్పు అంటుకోగా.. లేగదూడ శుక్రవాం మృతి చెందింది. మిగతావి తీవ్రంగా గాయపడ్డాయి.

Cattle Shed Fire | సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై, పశు వైద్యసిబ్బంది

సంఘటన జరిగిన ప్రదేశానికి పశు వైద్య సిబ్బందితో పాటు ఎస్సై మహేందర్​ చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ఆరా తీశారు. మృతి చెందిన దూడకు పశువైద్యులు పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.లక్షల్లో నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని.. నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ తహశీల్దార్​ రేణుక చవాన్​కు వినతిపత్రం అందజేశారు.

32

ఇది కూడా చదవండి: Arunachalam Girivalam | అరుణాచలంలో చిత్ర పౌర్ణమి వేడుకలు.. గిరి ప్రదక్షిణకు ముహూర్తం ఖరారు!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *