Farmer Welfare | రైతుల సంక్షేమం..మహిళల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం : ఎమ్మెల్యే మదన్​ మోహన్​

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి, మహిళా సంఘాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, లింగంపేట : Farmer Welfare | కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి మహిళా సంఘాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) అన్నారు. లింగంపేట(lingampet) మండల కేంద్రంతోపాటు, శెట్​పల్లి, అయ్యపల్లి, శెట్పల్లి సంగారెడ్డి గ్రామాల్లో మంగళవారం గోదాంల నిర్మాణానికి, మహిళా సంఘాల భవనాలకు, గ్రామపంచాయతీ నిర్మాణానికి , పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Farmer Welfare |  రైతు పక్షపాతినే..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ రైతు పక్షానే ఉంటానని, తాడ్వాయి మండలంలో రెండోసారి మొక్కజొన్న కొనుగోలు జరిగేలా కృషి చేశానన్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాల కోసం పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు రైస్ మిల్లర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ధాన్యం సేకరణ చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.ఎల్లారెడ్డి రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పైలట్ ప్రాజెక్టును తీసుకువచ్చి రీ-సర్వే జరిగేలా కృషి చేశానని, అసెంబ్లీలో కూడా అనేకసార్లు ఎల్లారెడ్డి రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను వెల్లడించారు.

Farmer Welfare | రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని అదే నమ్మకంతో తాను పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేసుకునేందుకు గోదాంల నిర్మాణం కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఎల్లారెడ్డి(Yellareddy) రైతుల గోసను వివరించి గోదాంల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. మహిళా సంఘాల కోసం భవనం నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాన్నారు.

Farmer Welfare | గోదాంల నిర్మాణంతో ఉత్పత్తులు భద్రం..

గోదాం నిర్మాణం ద్వారా రైతులు తమ పంటను అకాల వర్షాల నుంచి రక్షించుకుని భద్రంగా నిల్వ చేసుకునే అవకాశం కలగనుండగా, మహిళా సంఘం భవనం ద్వారా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణకు శాశ్వత వేదిక అందుబాటులోకి రానుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోకుల్ సాయిరాం, సర్పంచుల పోరం అధ్యక్షుడు సక్కు నాయక్, సర్పంచులు అట్టెం శ్రీనివాస్, కౌడా రవి, గోనెలింగం, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జొన్నల రాజు, సొసైటీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ మైనార్టీ కార్యదర్శి రఫీయోద్దీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారా గౌడ్, డిష్ అశోక్, ప్రతాప్  పాల్గొన్నారు.

madna1

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *