అక్షరటుడే, ఎల్లారెడ్డి: Road Accident | ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నిజామాబాద్–పిట్లం రోడ్డుపై వడ్డేపల్లి శివారులో బుధవారం చోటు చేసుకుంది.
Road Accident | వడ్డేపల్లి శివారులో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోర్గల్ గ్రామానికి చెందిన జుంజురు దినేష్(26), జుంజురు రమేష్(24) ఇద్దరు యువకులు బైక్‌పై వస్తుండగా వడ్డేపల్లి శివారులోని కంకర మిషన్ వద్ద వీరి బైక్‌ను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో జుంజురు దినేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డి వస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) ప్రమాద స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇది కూడా చదవండి..: Mobile Recovery | నెలలో రూ.21లక్షల విలువైన ఫోన్ల రికవరీ : ఎస్పీ రాజేష్ చంద్ర