Bheemgal Oora Panduga | భీమ్​గల్​లో వైభవంగా ‘ఊర పండుగ’

అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో భీమ్​గల్ పట్టణంలో ఊరపండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal Oora Panduga | కులమతాలకు అతీతంగా, అన్ని వర్గాల కుల సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ఊరపండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం మొక్కులు చెల్లించుకున్నారు.

Bheemgal Oora Panduga | ఏకతాటిపైకి పండుగ నిర్వహణ భేష్​

ప్రశాంత్​రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ చిన్న-పెద్ద తేడా లేకుండా ఏకతాటిపైకి వచ్చి ఈ సామూహిక ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఇందులో తాను భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు.భీమ్​గల్‌ ప్రాంతం ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Bheemgal Oora Panduga

ఇది కూడా చదవండి..: Fishermen Association | మత్స్యకార సంఘానికి కేంద్ర నిధులతో ఊతం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *