నిజామాబాద్Collector Ila Tripathi | లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకుసాగాలి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Collector Ila Tripathi | లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకుసాగాలి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. టెన్త్​ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన సిరికొండ జడ్పీహెచ్​ఎస్ విద్యార్థులను అభినందించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Collector Ila Tripathi | విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో (SSC results) సిరికొండ (Sirikonda) మండల కేంద్రంలోని జడ్పీహెచ్​ఎస్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా వారు ప్రజావాణిలో (Prajavani) కలెక్టర్​ను కలివగా.. అభినందించారు.

Collector Ila Tripathi | ఏం అవ్వాలనుకుంటున్నారు..?

పదో తరగతి ఫలితాల్లో 550కు పైగా మార్కులు సాధించి పాఠశాలకు పేరు తెచ్చిన విద్యార్థులను కలెక్టర్​ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారంటూ కలెక్టర్​ వారిని అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో అధ్యాపకుల సలహాలు సూచనలు పాటిస్తూ బాగా చదువుకుని ఉత్తమ స్థానాల్లో నిలవాలని సూచించారు. 107 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై కలెక్టర్​ డీఈవో అశోక్​ను అభినందించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ (PRTUTS)​ జిల్లా అధ్యక్షుడు మోహన్​రెడ్డి, జడ్పీహెచ్​ఎస్​ సిరికొండ గెజిటెడ్​ హెచ్​ఎం సతీష్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

ui

ఇది కూడా చదవండి: Mamata Banerjee Statement| అంతిమ విజయం తృణమూల్ దే.. బెంగాల్ గడ్డపై దీదీ ధీమా!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bengal Political Crisis|మే 9న కొత్త సర్కార్.. మమత పట్టుదలకు ఈసీ నోటిఫికేషన్‌తో బ్రేక్!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Bengal Political Crisis|పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం...

IPL 2026 Playoffs | ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. అహ్మదాబాద్‌లో మే 31న ఫైనల్

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2026 Playoffs | ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం...

Paddy Farmers | ప్రాణాలు పోతున్న పట్టదా.. కొనుగోలు కేంద్రాల్లో చనిపోతున్న రైతులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Paddy Farmers | ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం,...