నిజామాబాద్Kamareddy police controversy | సీఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలి - ఎస్పీకి ఆర్గొండ సర్పంచి...

Kamareddy police controversy | సీఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలి – ఎస్పీకి ఆర్గొండ సర్పంచి ఫిర్యాదు

ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు వెళ్లడంతో, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసు దర్యాప్తుతో పాటు పోలీసుల వ్యవహారంపై కూడా విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kamareddy police controversy | కామారెడ్డి పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలుడి హత్య కేసులో పోలీసుల వ్యవహారశైలిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం చర్చకు దారితీసింది. ఈ నెల 18న జరిగిన ఈ దారుణ ఘటనలో బాలుడిని తల్లి, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు.

ఈ కేసులో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో బాలుడి తండ్రి నుంచి ఫిర్యాదు స్వీకరించకుండా, తల్లి తరఫు బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకోవడం విమర్శలు ఉన్నాయి.

Kamareddy police controversy | అవమానించారని..

ఈ నేపథ్యంలో బాలుడి తండ్రి భాస్కర్ స్వగ్రామమైన ఆర్గొండ సర్పంచి విక్రాంత్ రెడ్డి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. తండ్రి నుంచి ఫిర్యాదు లేదా వాంగ్మూలం తీసుకోవాలని సర్పంచి కోరగా.. సీఐ నరహరి తనతో అవమానకరంగా ప్రవర్తించారని సదరు సర్పంచి ఆరోపించారు.

అంతేకాకుండా, తాను ఫోన్‌లో సంభాషణను రికార్డు చేస్తున్నానన్న కారణంతో తన ఫోన్‌ను లాక్కొని ముగ్గురు కానిస్టేబుళ్లు తనపై దాడి చేశారని ఎస్పీకి సర్పంచి ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న తనను అవమానించడమే కాకుండా దాడి చేశారని, సంబంధిత సీఐతోపాటు కానిస్టేబుళ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని సర్పంచి కోరారు.

Kamareddy police controversy | సీఐ ఖండన..

అయితే, ఈ ఆరోపణలను సీఐ నరహరి ఖండించారు. తాను తప్పు చెయ్యలేదని, సర్పంచిపై కానిస్టేబుళ్లు దాడి చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. కాగా, ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు వెళ్లడంతో, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసు దర్యాప్తుతో పాటు పోలీసుల వ్యవహారంపై కూడా విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Vijayawada college harassment | ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం

ఇది కూడా చదవండి: Indian Woman Speech | ‘మతాన్ని మార్చం.. మనసులను గెలుస్తాం!’ టెక్సాస్ కౌన్సిల్ హాల్‌లో ప్రతిధ్వనించిన భారతీయ గళం

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...