Farmers Protest | సొసైటీ కార్యాలయానికి తాళం వేసి రైతుల నిరసన

Shashi kiran Mottala
Farmers Protest | సొసైటీ కార్యాలయానికి తాళం వేసి రైతుల నిరసన

అక్షరటుడే, బాన్సువాడ: Farmers Protest | బీర్కూర్ (Birkur)​ మండలంలోని బైరాపూర్ గ్రామంలో రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. సొసైటీ (Bairapur Society) పరిధిలో ధాన్యానికి కాంటాలు (paddy procurement) వేయకపోవడం, ఇతర గ్రామాలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. ఆగ్రహానికి లోనైన రైతులు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.

Farmers Protest | వారం రోజులుగా..

గత వారం రోజులుగా సొసైటీ కార్యదర్శి విధులకు హాజరు కాకపోవడంతో పాటు, ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణ (Weather) హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో, కోసిన ధాన్యం తడిసిపోతుందనే భయంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈనెల 4న కోసిన వడ్లకు ఇప్పటివరకు కాంటాలు వేయకపోగా 18న కోసిన వడ్లకు మాత్రం వెంటనే కాంటాలు వేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల మధ్యవివక్ష చూపకుండా వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

paddy 1

ఇది కూడా చదవండి: Kavita new party | కవిత పార్టీలో చేరికల జోరు.. జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యే

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *