Kavita new party | కవిత పార్టీలో చేరికల జోరు.. జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యే

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavita new party | తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25న కొత్త పార్టీ పెట్టనున్నారు. ఈ క్రమంలో ఆమె పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో నాయకులు, వారి అనుచరులు జాగృతిలో చేరుతున్నారు. తాజాగా ఆదిలాబాద్​ జిల్లా బోథ్​ మాజీ ఎమ్మెల్యే బాపూరావు (EX MLA Bapurao) జాగృతిలో చేరారు.

బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో బాపూరావు జాగృతి కండూవా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారని చెప్పారు. అనుభవం ఉన్న ఆయన కొత్తగా పెట్టే తమ పార్టీ బలోపేతం కోసం వచ్చారన్నారు. బాపూరావు, ఆయనతోపాటు వచ్చిన అనుచరులకు ఆమె స్వాగతం పలికారు. అనేక జిల్లాల నుంచి ప్రజలు, నాయకులు వచ్చి జాగృతిలో చేరుతున్నారని పేర్కొన్నారు. నూతనంగా పెట్టే పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని నిత్యం ఎంతో మంది జాగృతిలో చేరుతున్నారని చెప్పారు.

Kavita new party | ఉద్యోగం వదిలి ఉద్యమంలోకి..

బాపూరావుతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని కవిత అన్నారు. 2007లో తాను బోథ్​ నియోజకవర్గంలో వైద్య శిబిరం పెట్టినట్లు గుర్తు చేశారు. బాబూరావు తెలంగాణ ఉద్యమం కోసం టీచర్​ ఉద్యోగాన్ని వదులుకున్నారని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన పలువురు సైతం జాగృతిలో చేరారు. ఉద్యమకారులంతా మళ్లీ ఏకం కావాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. ఉద్యమకారులు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

Kalvakuntla Kavitha

Kavita new party | రెండు సార్లు ఎమ్మెల్యేగా

బాపూరావు 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్​ఎస్​లో పని చేశారు. 2014లో బీఆర్ఎస్​ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అనంతరం 2018లో సైతం విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా కవిత కొత్తగా పెట్టే పార్టీలోకి వెళ్తున్నారు.

దీనిని కూడా చదవండి : Revanth Reddy | గవర్నర్​ను కలిసిన సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *