Anganwadi Salaries | అంగన్​వాడీలకు జీతాలు చెల్లించాలి: హరీశ్​రావు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anganwadi Salaries | మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) , ముందు అంగన్​వాడీలకు జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao)  అన్నారు. రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్​వాడీ టీచర్ల కష్టాలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

అంగన్​వాడీ సిబ్బంది వేతనాలపై హరీశ్​రావు ఎక్స్​వేదికగా ప్రశ్నించారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్​వాడీ సిబ్బందిని ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయం అన్నారు.

Anganwadi Salaries | గౌరవాన్ని పెంచారు

అంగన్​వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ వారు వర్కర్లు కాదని, టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారని హరీశ్​రావు గుర్తు చేశారు. వారి గౌరవాన్ని కేసీఆర్ పెంచారన్నారు. 2014 నాటికి అంగన్​వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేదని తెలిపారు. బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800లకు, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచినట్లు పేర్కొన్నారు. రెండు నెలలుగా పెండింగ్​లో ఉన్న అంగన్వాడీల వేతనాలను చెల్లించాలని, అప్ గ్రేడ్ చేసిన మినీ అంగన్ వాడీలకు ఏడాదిగా పెండింగ్​లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని ఆయన డిమాండ్​ చేశారు.

Anganwadi Salaries

ఇది కూడా చదవండి..: Asifabad Forest Tension | ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న రైతులు.. ఆసిఫాబాద్​ జిల్లాలో ఉద్రిక్తత

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *