Steel Plant Compensation | స్టీల్‌ప్లాంట్‌ ఘటన.. పరిహారం ప్రకటించిన పవన్‌

వైజాగ్ స్టీల్​ ప్లాంట్​ ప్రమాద బాధితులను డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామన్నారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Steel Plant Compensation | వైజాగ్ స్టీల్​ ప్లాంట్​ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి విశాఖపట్నం కిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ మంగళవారం పరామర్శించారు.

ప్రమాదం జరిగిన తీరుని పవన్​ (Deputy CM Pawan Kalyan) తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు.

Steel Plant Compensation | త్రీమెన్​ కమిటీ విచారణ

Steel Plant Compensation

స్టీల్​ ప్లాంట్​లో 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని పవన్​ అన్నారు. ఈ ఘటనపై త్రీమెన్ కమిటీ విచారణ చేస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని తమ ఆకాంక్ష అని చెప్పారు. త్వరలోనే ప్లాంట్ కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకుంటానని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Visakha Steel Plant Accident | స్టీల్​ ప్లాంట్​ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేశ్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *