Srivari Vaidya Seva | ‘శ్రీవారి వైద్య సేవ’ ప్రారంభం.. వైద్య నిపుణులకు టీటీడీ ఆహ్వానం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srivari Vaidya Seva | టీటీడీ (TTD) ఆస్పత్రుల్లో “శ్రీవారి వైద్య సేవ” కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను టీటీడీ ఈవో రవిచంద్ర ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

తిరులల (Tirumala)లో ప్రస్తుతం వివిధ రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. భక్తులు స్వామివారికి, భక్తులకు సేవలు అందించే సౌకర్యాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా టీటీడీ ఆస్పత్రుల్లో స్వచ్ఛందంగా సేవలు చేయడానికి వైద్య సేవను ప్రవేశ పెట్టింది. వైద్య నిపుణులు దీనిని వినియోగించుకోవచ్చు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. అనంతరం ఇందులో పాల్గొన్న డాక్టర్ల అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

Srivari Vaidya Seva | అన్ని వసతులు

టీటీడీ ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో సేవలందించేందుకు వచ్చే నిపుణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేసి ఎక్కువ మంది నిపుణుల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపడతామని పేర్కొంది. ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని సేవలందించవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజుల పాటు, ఎంబీబీఎస్ వైద్యులకు ఏడు రోజుల పాటు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం కల్పించనున్నారు. హిందూ మతానికి చెందిన ఆసక్తిగల వైద్య నిపుణులు ఆన్‌లైన్ ద్వారా టీటీడీ వెబ్ సైట్​లో స్లాట్​ బుక్​ చేసుకోవచ్చని ఈవో వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : Municipal Commissioner Suspension | సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *